(1)
జయ జయ జగన్నాథ సచిర నందన్
త్రిభువన కోర్ జర్ చరణా వందన్
(2)
నీలాచలే శంఖా చక్ర గథా పద్మ థర నదియా నగరే దండా కమండలు కర
(3)
కేహో బోలే పురబెటే రావణ
బాధిలా గోలోకేర్ వైభవ లీలా ప్రకాశ కోరిలా
(4)
శ్రీ-రాధర్ భావే ఎబే గోరా అవతార్
హరే కృష్ణ నామ్ గౌర కోరిలా ప్రచార్
(5)
వాసుదేవ ఘోష బోలే కోరి జోడ హాట్ జీ
గౌర సేయి కృష్ణ సేయ్ జగన్నాత్
జగన్నాథ్ మిశ్రా, శచిమాతల తనయునికి జయము, జయము. మూడు లోకములు అతడి పాదపద్మములకు వందనము కావించును.
నీలాచలముపై అతడు శంఖ, చక్ర, గద, పద్మములను ధరించును. నదియా నగరములో అతడే సన్యాసిగా దండ, కమండలములను ధరించును.
పూర్వం అతడే శ్రీరామచంద్రుడిగా రావణుడిని సంహరించెను. తరువాత అతడే శ్రీకృష్ణునిగా గోలోకములోని దివ్యలీలలను ప్రదర్శించెను.
శ్రీరాధాదేవి యొక్క దివ్య ప్రేమభావముతో అతడే మేలిమి బంగారు ఛాయతో అవతరించాడు. ఆ గౌరంగ మహాప్రభువే 'హరేకృష్ణ' మహామంత్రమును విస్త్రృతముగా ప్రచారము చేసెను.
వాసుదేవ ఘోష్ చేతులు జోడించి ఇలా ప్రార్థిస్తున్నాడు : “శ్రీ గౌరంగ మహాప్రభువే శ్రీకృష్ణుడు, అతడే శ్రీ జగన్నాథుడు.'
Comments